తెగుళ్లతో తంటాలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:04 AM
వేరుశనగ పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుందుర్పి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వేరుశనగ పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని మందులు వాడినా ఆశించిన ఫలితాలు రాక కుదేలవుతున్నారు. ఖరీ్‌ఫలోను, రబీలో ఎక్కువ శాతం మంది రైతులు వేరుశనగ సాగు చేసి లాభాలు పొందేవారు. మూడేళ్లుగా వేరుశనగ పంటలకు చీడపీడలు అధికంగా సోకుతున్నాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. తిక్క తెగులు, నల్లమచ్చ సోకి పంట దిగుబడి తగ్గిపోతోంది. చీడపీడలపై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండటం లేదు. వేరుశనగ పంటకు గతంలో మహా అంటే రెండుసార్లు మందు పిచికారి చేసేవారు. ఇప్పుడైతే పదిసార్లు మందులు పిచికారి చేసినా తెగుళ్లు తగ్గడం లేదు. దీంతో రైతులు వేలకు వేలు మందుల కోసం ఖర్చు చేస్తూ.. అప్పులపాలు అవుతున్నారు. వేరుశనగ పంట ఏపుగా వచ్చినా.. తెగుళ్లు ఆశించి ఆకులు, కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడి.. దిగుబడి పూర్తి తగ్గిపోతోంది. తెగుళ్లను గుర్తించి.. వాటికి మందులు సూచించాల్సిన వ్యవసాయాధికారులు, రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.