Share News

గ్రాసం కోసం ఇక్కట్లు

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:13 AM

పశుగ్రాసం కొరత తీవ్రమైంది. పశుపోషకులు గ్రాసం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్‌ వరిగడ్డి రూ.8వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది.

గ్రాసం కోసం ఇక్కట్లు

ఉరవకొండ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పశుగ్రాసం కొరత తీవ్రమైంది. పశుపోషకులు గ్రాసం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్‌ వరిగడ్డి రూ.8వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది. ఏటా వేరుశనగ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. దీనికి తోడు ఏటా వర్షాభావంతో గ్రాసం కూడా తగ్గుతుండటంలో రైతులు, పశుపోసకులు అవస్థలు పడుతున్నారు. దీంతో వరిగడ్డి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఉరవకొండ నియోజకవర్గంలో ఎనుములు 13,177, మేకలు 69,440, గొర్రెలు 3,78,364 ఉన్నాయి. ఈ సారీ హెచ్చెల్సీ కాలువ కింద కణేకల్లు, బొమ్మనహాల్‌ మండలాల్లో మాత్రమే వరి సాగు చేస్తారు. విడపనకల్లు మండలంలో ఆయకట్టు ఉన్నా, వరి సాగు చేయరు. దీంతో కణేకల్లు, బొమ్మనహాల్‌ మండలాల నుంచి రైతులు కొనుక్కోవాల్సి వస్తోం ది. ఏడాదికి నాలుగు పశువులకు రూ.లక్ష దాకా ఖర్చుఅవుతుందని పేర్కొంటున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:13 AM