Share News

JAC: అంబేడ్కర్‌ జయంతిని అడ్డుకోవడం దుర్మార్గం

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:05 AM

రాష్ట్రపతి నుంచి గ్రామస్థాయి అధికారివరకు కీర్తించే అంబేడ్కర్‌ జయంతిని అడ్డుకోవడం దుర్మార్గమని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి మండిపడ్డారు. ఇందుకు కారణమైన కనగానపల్లి మండలం కొండపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గురువారం అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి, జడ్జిబంగ్లా మీదుగా జిల్లా కోర్టువరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

JAC: అంబేడ్కర్‌ జయంతిని అడ్డుకోవడం దుర్మార్గం
SC, ST Association JAC leaders conducting the rally

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి నుంచి గ్రామస్థాయి అధికారివరకు కీర్తించే అంబేడ్కర్‌ జయంతిని అడ్డుకోవడం దుర్మార్గమని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి మండిపడ్డారు. ఇందుకు కారణమైన కనగానపల్లి మండలం కొండపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గురువారం అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి, జడ్జిబంగ్లా మీదుగా జిల్లా కోర్టువరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సాకేహరి, సాకే వన్నూరుస్వామి మాట్లాడు తూ కొండపల్లి గ్రామంలోని రాముల దేవాలయంలోకి మాదిగలు వెళ్లకుం డా కులంపేరుతో దూషిస్తూ చంద్రశేఖర్‌ రెడ్డిని అడ్డుకున్నారన్నారు. నేటీకీ సాగుతున్న కులవివక్షను తెలుసుకునేందుకు బార్‌ అసోసియేషన కొండపల్లిని సందర్శించాలని కోరారు. సీపీఐఎంఎల్‌ లిబరేషన పార్టీ కార్యదర్శి మేమన, ఓబులేసు, వెంకటేష్‌, శ్రీనివాసులు, విద్యావంతుల వేదిక వెంకటేష్‌, ఆంజనేయులు, చంద్ర, నరసింహులు, ముత్యాలప్ప, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:05 AM