శ్రీధరఘట్ట ఊరుదేవర ప్రారంభం
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:19 PM
మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలోని గ్రామదేవత శ్రీదేవమ్మదేవి దేవర మహోత్సవ పూ జలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
బొమ్మనహాళ్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలోని గ్రామదేవత శ్రీదేవమ్మదేవి దేవర మహోత్సవ పూ జలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గంగాజలం తెచ్చి అమ్మవారిని అభిషేకించారు. రాత్రి కుంభాలతో బోనాలు ఊ రేగించి అమ్మవారికి సమర్పించారు. అర ్ధరాత్రి బలి కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు.