శ్రీధరఘట్ట రోడ్డు .. గుంతలమయం
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:35 AM
మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట గ్రామాల రోడ్డు గుంతల మయమైంది.
బొమ్మనహాళ్, జనవరి 1(ఆంధ్రజ్యోతి) మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట గ్రామాల రోడ్డు గుంతల మయమైంది. నాలుగు కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు మొత్తం రాళ్లు, ఎగుడు దిగుడులతో వెళ్లడానికి వీలుకాని విధంగా ఉంది. ఈ రోడ్డుపై వెళ్తూ.. అనేక మంది ద్విచక్రవాహనదారులు కిందపడి ఆస్పత్రుల పాలయ్యారు. పంటలు తరలించే సమయంలో ఇక రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ రోడ్డును బాగు చేయాలని పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన కరవైందని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.