వాసవీమాతకు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:36 PM
వాస వీ మాత ఆత్మార్పణ దినం సందర్భంగా స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుంతకల్లుటౌన, జనవరి 20(ఆంధ్రజ్యోతి): వాస వీ మాత ఆత్మార్పణ దినం సందర్భంగా స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులతో క్షీరాభిషేకం, హోమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేషపుష్పలంకరణ చేసి పూజలు చేశారు. అమ్మవారికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుమ్మనూరు నారాయణస్వామి పట్టువసా్త్రలను సమర్పించారు. ఇందులో మున్సిపల్ చైర్‌పర్సన ఎన భవాని, ఆర్యవైశ్య సంఘం సెక్రెటరీ కందూరి కృపాకర్, కోశాధికారి మేడం వెంకటేశ్వర్లు, పూజ కమిటీ చైర్మన సత్యరంగయ్య, సభ్యులు జయంతి వెంకట్, గుండా విజయ్ పాల్గొన్నారు.