Share News

ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:18 AM

పట్టణంలోని స్వయంభు కాలభైరవస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శివరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి.

ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

ధర్మవరం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని స్వయంభు కాలభైరవస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శివరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. మంగళవారం అమావాస్యపూజల్లో భాగంగా కూష్మాండ దీపోత్సవాన్ని నిర్వహించారు. స్వామి ఎదుట బూడిద గుమ్మడికాయలపై దీపాలు వెలిగించారు. స్వామి వద్ద ఉంచి పూజించిన కంకణనాలను పూజారి ధనుంజయ ఆచారీ భక్తులకు అందజేశారు.

Updated Date - Feb 18 , 2026 | 12:18 AM