శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:56 PM
కంబదూరు మల్లేశ్వరస్వామి దేవాలయంలో గంగపూజతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
కళ్యాణదుర్గం, ఫిబ్రవరి8(ఆంధ్రజ్యోతి): కంబదూరు మల్లేశ్వరస్వామి దేవాలయంలో గంగపూజతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఆలయంలో వెలసిన కోనేరుబావిలో గంగపూజను వీక్షించడానికి అశేషభక్తజనం తరలివచ్చారు. గంగపూజను నిర్వహించిన అనంతరం అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దేవాలయంలో భజనను ప్రారంభించారు. ఇలా వారం పాటు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు, నిత్య భజనలు నిర్వహించడం ఆనవాయితీ.