Share News

కలగానే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:21 AM

వేసవి కాలం వస్తోందటే తొమ్మిది మండలాల ప్రజలకు హడల్‌. కదిరి, ఓడీసీ, గాండ్లపెంట, ఎన్పీకుంట, నల్లచెరువు, తనకల్లు, ఆమడగూరు, నల్లమాడ, ముదిగుబ్బ మండలాలకు కలిపి అగ్నిమాపక కేంద్రాన్ని కదిరిలో ఏర్పాటు చేశారు.

కలగానే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

ఓబుళదేవరచెరువు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): వేసవి కాలం వస్తోందటే తొమ్మిది మండలాల ప్రజలకు హడల్‌. కదిరి, ఓడీసీ, గాండ్లపెంట, ఎన్పీకుంట, నల్లచెరువు, తనకల్లు, ఆమడగూరు, నల్లమాడ, ముదిగుబ్బ మండలాలకు కలిపి అగ్నిమాపక కేంద్రాన్ని కదిరిలో ఏర్పాటు చేశారు. ఓడీసీ నుంచి కదిరి 23 కిలోమీటర్లు. ఇక మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే 40 కిలోమీటర్లపై మాటే. అంతేకాకుండా ఈ కేంద్రంలో ఒకే ఫైర్‌ ఇంజన ఉండటంతో .. ఈ తొమ్మిది మండలంలో రెండు ప్రాంతాల్లో ఒకేసారి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక సంఘటన స్థలానికి వెళ్లిన ఫైర్‌ ఇంజన అక్కడ మంటలు ఆర్పి.. అనంతరం మరో సంఘటన స్థలానికి వెళ్లాల్సి ఉంది. దీంతో ఈ ఫైర్‌ఇంజన వచ్చేలోపు పూర్తిస్థాయిలో నష్టం జరిగిపోతోంది. అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైర్‌ ఇంజన రావడానికి కనీసం గంట పైనే సమయం పడుతోంది. దీన్ని నివారించడానికి గత టీడీపీ హయాంలో నల్లమాడ, అమడగూరు, ఓడీపీ మండలాలకు కలిపి ఓబులదేవరచెరువులో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపా రు. స్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇ ప్పటికైనా కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతనిధు లు స్పందించి ఓడీసీలోలో అగ్నిమాపక కేం ద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ మూడు మండల వాసులు కోరుతున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:22 AM