Satya Sai సన్మార్గదర్శి సత్యసాయి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:20 AM
నేటి సమాజంలోని పిల్లలను సత్యసాయి బోధనలు సన్మార్గంలో నడిపిస్తాయని నాటిక ద్వారా విద్యార్థులు తెలియజేశారు. సోమవారం రాత్రి సాయి కుల్వంత నందు సత్యసాయి హయ్యర్ సెకండరీ విద్యార్థులు సన్మార్గదర్శి నాటికను ప్రదర్శించారు.
పుట్టపర్తి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): నేటి సమాజంలోని పిల్లలను సత్యసాయి బోధనలు సన్మార్గంలో నడిపిస్తాయని నాటిక ద్వారా విద్యార్థులు తెలియజేశారు. సోమవారం రాత్రి సాయి కుల్వంత నందు సత్యసాయి హయ్యర్ సెకండరీ విద్యార్థులు సన్మార్గదర్శి నాటికను ప్రదర్శించారు. పిల్లలు, యువత నిత్యం సోషల్ మీడియా, సినిమాలతో తమకాలాన్ని వృథా చేసుకుంటూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని నాటిక ద్వారా తెలియజేశారు. విద్యార్థులు సత్యసాయి పల్లకిని మోస్తూ నృత్యం చేస్తూ భక్తి పాటలు పాడారు. అనంతరం 10, 12వ తరగతుల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ చాన్సలర్ చక్రవర్తి, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ మెమెంటోలు అందజేసి అభినందించారు.