సర్పంచ్‌ను చేస్తే 30 లక్షలు ఇస్తా
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:04 AM
సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకుండానే గ్రామాల్లో ఆశావహులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురంలో .....
అనంతపురం జిల్లాలో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి
విడపనకల్లు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకుండానే గ్రామాల్లో ఆశావహులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురంలో 15 రోజుల కిందట ఓబులేసు అనే వ్యక్తి తొలిగా దండోరా వేయించారు. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ. 12 లక్షలు ఇస్తానని డప్పు కొట్టి చెప్పారు. ఇదే తరహాలో విడపనకల్లులో శుక్రవారం ఉదయం యొగమ్మగారి మల్లికార్జున అనే వ్యక్తి కూడా దండోరా వేయించారు. విడపనకల్లు సర్పంచ్ పదవికి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ. 30 లక్షలిస్తానని ప్రకటించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఓబులేసు, మల్లికార్జునలను విడపనకల్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అనుమతి లేకుండా ఎవరూ దండోరా వేయవద్దని, ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.