Share News

అన్ని గ్రామాలకూ రోడ్లు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:05 AM

రాబోయే మూడేళ్లలో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు వేయిస్తామని, 114 చెరువులనూ కృష్ణాజలాలతో నింపి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.

అన్ని గ్రామాలకూ రోడ్లు: ఎమ్మెల్యే
పాసుపుస్తకాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాబోయే మూడేళ్లలో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు వేయిస్తామని, 114 చెరువులనూ కృష్ణాజలాలతో నింపి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. గురువారం స్థానిక ప్రజావేదిక వద్ద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను, బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం ఆయన పంపిణీ చేశారు. బీటీపీ ప్రాజెక్టు కాలువ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 09 , 2026 | 12:05 AM