Share News

దిష్టిబొమ్మలా ఆర్వో ప్లాంట్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:15 AM

మండలంలోని రేకులకుంట ప్రభుత్వ పాఠశాలలో 2020-21 సంవత్సరంలో రూ. 2.6 లక్షలు వెచ్చించి ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు.

దిష్టిబొమ్మలా ఆర్వో ప్లాంట్‌
రేకులకుంట పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న ఆర్వో ప్లాంట్‌

రాయదుర్గంరూరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రేకులకుంట ప్రభుత్వ పాఠశాలలో 2020-21 సంవత్సరంలో రూ. 2.6 లక్షలు వెచ్చించి ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. కొన్ని రోజులకే అది చెడిపోయింది. పలుమార్లు ప్రధానోపాధ్యాయుడు ఆ ఆర్వో కంపెనీ టెక్నీషియన్సకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో అది నిరుపయోగంగా పడింది. ఆ పాఠశాలలోని 91 మంది విద్యార్థులు, సిబ్బంది తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:15 AM