Share News

Ring Road రింగురోడ్డుతో పుట్టపర్తి సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:18 AM

జిల్లాకేంద్రం సమగ్రాభివృద్ధిలో రింగురోడ్డు కీలకం కానుందని ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఫోర్‌లేన రోడ్డ నిర్మాణ పనుల నాణ్యతను సోమవారం ఆయన పరిశీలించారు.

Ring Road రింగురోడ్డుతో పుట్టపర్తి సమగ్రాభివృద్ధి
ఫోర్‌లేన రోడ్డు నాణ్యతా ప్రమాణాన్ని పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఎమ్మెల్యే పల్లెసింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి

పుట్టపర్తిరూరల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం సమగ్రాభివృద్ధిలో రింగురోడ్డు కీలకం కానుందని ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఫోర్‌లేన రోడ్డ నిర్మాణ పనుల నాణ్యతను సోమవారం ఆయన పరిశీలించారు. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్బంగా రూ.2.5 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీరోడ్డు నాణ్యతను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఫోర్‌లేన రోడ్డు పుట్టపర్తి పట్టణానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఎయిర్‌పోర్టు రోడ్డులో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు ఈ రింగురోడ్డు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాట్లాడుతూ పట్టణానికి రింగురోడ్డు నిర్మాణం ఒక వరం అన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తగ్గడమే కాక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తిలాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి అత్యంత అవసరమన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, ఇంజనీర్లు స్థానిక నాయకులు సామకోటి ఆదినారాయణ, అంబులెన్సు రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:18 AM