Share News

కంది రైతుకు ఊరట

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:33 AM

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న కంది రైతులకు కూటమి ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది

కంది రైతుకు ఊరట
తగ్గుపర్తిలో కందులను నూర్పిడి చేస్తున్న కూలీలు, రైతులు

బెళుగుప్ప, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న కంది రైతులకు కూటమి ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. మండలంలో 18 వేల ఎకరాల్లో ఈ యేడాది కంది పంట సాగుచేశారు. పంటను పొలాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ఎప్పటిలాగే ప్రైవేటు మార్కెట్‌ వ్యాపారులు కుమ్మక్కై.. తక్కువ ధరకు ఆ పంటను క్వింటా రూ. ఏడు వేలతో కొనుగోలు చేయానికి ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటా రూ. ఎనిమిది వేలతో కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:34 AM