వరిసాగుకు సిద్ధం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:02 AM
పీఏబీఆర్ కుడికాలువ నీరు మండలంలోని అరవకూరు చెరువుకు వస్తుండటంతో ఆయకట్టు రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు.
కూడేరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): పీఏబీఆర్ కుడికాలువ నీరు మండలంలోని అరవకూరు చెరువుకు వస్తుండటంతో ఆయకట్టు రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు. చెరువు కింద అరవకూరు, కమ్మూరు గ్రామాల్లో దాదాపు 200 ఎకరాలకు పైగా వరిసాగు చేయడానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. వరినాట్లు వేయడానికి అన్నదాతలు భూములను ట్రాక్టర్లు, ఎద్దులతో చదును చేస్తున్నారు.