రైతులకు నాణ్యమైన విద్యుత్తే లక్ష్యం : విప్
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:11 AM
పొలాలకు అంతరాలు, లో ఓల్టేజీ లేని నాణ్యమైన విద్యుత సరఫరా చేయడమే లక్ష్యమని విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
రాయదుర్గంరూరల్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పొలాలకు అంతరాలు, లో ఓల్టేజీ లేని నాణ్యమైన విద్యుత సరఫరా చేయడమే లక్ష్యమని విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని పల్లేపల్లి విద్యుతసబ్‌స్టేషనలో ఐదు మెగావాట్ల సామర్థ్యం కలిగిన అదనపు ట్రాన్సఫార్మర్లను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఇక వ్యవసాయానికి, ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం పూటే త్రీఫేజ్ విద్యుత సరఫరా అవుతుందన్నారు. ఆగిపోయిన సుమారు రూ.60 కోట్ల విలువైన ఆర్డీఎ్‌సఎస్ పనులను పునః ప్రారంభించి 40 శాతం పూర్తి చేశామన్నారు. గత ఏడాది నియోజకవర్గానికి రెగ్యులర్‌గా ఇచ్చే వాటితో పాటు 550 అదనపు ట్రాన్సఫార్మర్లు మంజూరు చేశారని, దీంతో డిసెంబరు వరకు దరఖాస్తు చేసిన వారందరికీ వ్యవసాయ విద్యుత సర్వీసులు ఇచ్చామని అన్నారు. ఇందులో మండల కన్వీనర్ కురుబ హనుమంతు, సదాశివ, జనసేన ఇనఛార్జ్ మంజునాథ్‌గౌడ్, పాటిల్ అజయ్, సర్పంచ రాధమ్మ, మల్లేశప్ప, రాజశేఖర్‌రెడ్డి, వన్నూరుస్వామి పాల్గొన్నారు.