Share News

కందుల కొనుగోళ్లు ప్రారంభం

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:23 PM

స్థానిక మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ప్రారంభించారు.

కందుల కొనుగోళ్లు ప్రారంభం
కందుల కొనుగోళ్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జయరాం

గుంతకల్లు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్‌ ధర కంటే రూ. వెయ్యి అధిక మద్దతు ధరతో ప్రభుత్వం కందులు కొనుగోలు చేస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డీఎం పెన్నేశ్వరి, ఏడీఏ సత్యనారాయణ, టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, బీఎస్‌ కృష్ణారెడ్డి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, తలారి మస్తానప్ప, లక్ష్మిదేవి, పాల మల్లికార్జున, రాయల రామయ్య, రామప్ప, యుగంధర్‌, వీరేశ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:23 PM