మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించండి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:12 AM
ప్రభుత్వం మొక్కజొన్నకు గి ట్టుబాటు ధర కల్పించాలని మండల రైతులు కోరుతున్నారు. వివిధ గ్రామాల్లో 1500 ఎకరాలకుపైగా ప్రస్తుతం మొక్కజొన్న కోత దశలో ఉందన్నారు.
తనకల్లు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మొక్కజొన్నకు గి ట్టుబాటు ధర కల్పించాలని మండల రైతులు కోరుతున్నారు. వివిధ గ్రామాల్లో 1500 ఎకరాలకుపైగా ప్రస్తుతం మొక్కజొన్న కోత దశలో ఉందన్నారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు లేకపోవడంలో అడిగినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని గేమేనాయక్ తండా రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు ఎంఎ్‌సపి ధరలు ప్రకటిస్తే కొనుగోలు దారులు కొంతైనా ధరలు పెంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో మొక్కజొన్నను అలాగే పొలాల్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం మద్దత ధర ప్రకటించి, ఆదుకోవాలని కోరారు.