అధికారుల తీరుపై నిరసన
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:57 PM
మూడు నెలల ఒక్కసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులు గైర్హాజర్ కావడంపై ఎంపీటీసీలు, సర్పంచులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
ఉరవకొండ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మూడు నెలల ఒక్కసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులు గైర్హాజర్ కావడంపై ఎంపీటీసీలు, సర్పంచులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వజ్రకరూరు మండల సర్వసభ్య సమావేశాన్ని బహిస్కరించి.. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు గౌరవ వేతనం ఇవ్వడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. సమావేశానికి రావాలని ఎంపీడీవో సభ్యులను కోరగా.. వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశం వాయిదా పడింది. కాగా, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తారా అంటూ వైసీపీ సర్పంచుల విలేకరులపై బెదింపులకు పాల్పడ్డారు.