ప్రభుత్వ భూములను కాపాడండి
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:19 AM
తలుపుల మండల కేంద్రంలో ప్రభు త్వ భూములను కబ్జాకాకుండా కాపాడాలని సీపీఐ నాయకులు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు.
కదిరి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): తలుపుల మండల కేంద్రంలో ప్రభు త్వ భూములను కబ్జాకాకుండా కాపాడాలని సీపీఐ నాయకులు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. తలుపుల కోటగోడకు ఆనుకొని ఉన్న 8.16 ఎకరాలు, తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోని 30 సెంట్లను కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని, అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రభుత్వ భూములు కాపాడాలని కోరారు. దివ్యాంగుల భవనానికి, భారత కమ్యూనిష్టు పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ఆ స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఇందులో పార్టీ మండల కార్యదర్శి జగిల ఈశ్వరయ్య, డీహెచఎ్‌స సమితి, జిల్లా కార్యదర్శి అంజన్న బాబు, సిద్దయ్య, ఎల్‌వీ రమణ, దివ్యాంగులు పాల్గొన్నారు.