Share News

తపాలా సేవలను మరింత బలోపేతం చేయాలి

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:18 AM

తపాలా శాఖ లో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా సేవలను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం (జీడీఎస్‌) నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరారు.

తపాలా సేవలను మరింత బలోపేతం చేయాలి
GDS union leaders submitting a memorandum to the MP

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): తపాలా శాఖ లో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా సేవలను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం (జీడీఎస్‌) నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరారు. శనివారం నగర శివారులోని ఎంపీ నివాసంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్‌, నాయకులు శ్రీరాములు నాయక్‌, శ్రీనివాసులు, మారుతీశ్వర్‌రెడ్డి, శంకర్‌ నాయక్‌ ఆయనకు వినతి పత్రం అందజేశారు. తపాలా శాఖ ద్వారా పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆనలైన వ్యాపార సేవలను మెరుగుపర్చాలన్నారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. కేంద్ర కమ్యూనికేషన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కరించేలా చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.

Updated Date - Apr 26 , 2026 | 12:18 AM