SWATCHANDHRA: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:19 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పీఆర్ సబ్‌డివిజన-1 డీఈ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
అనంతపురం న్యూటౌన, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పీఆర్ సబ్‌డివిజన-1 డీఈ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కార్యాలయ పరిసర ప్రాంతాల్లో శనివారం పరిశుభ్రం చేశారు. ఏఈలు శేషయ్య, పార్థసారథి, కిశోర్‌కుమార్, జేటీఈఓ ఖాజాపీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రితిక పాల్గొన్నారు.
జడ్పీలో ప్రతిజ్ఞ: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జడ్పీ ఆవరణంలో పరిసరాలు పరిశుభ్రం చేశారు. అనంతరం సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఏవో విజయబాష్కర్‌రెడ్డి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమన్నారు. ఏవోలు నియాజ్‌బాషా, శ్రీనివాసులు, శ్రీవాణి, మహబూబ్‌వలి, ముత్యాలరెడ్డి పాల్గొన్నారు.
డీఈవో కార్యాలయంలో..
అనంతపురం విద్య: నగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇనచార్జి డీఈవో శ్రీనివాసరావు, సిబ్బంది ఆవరణలోని చెత్తాచదారాన్ని శుభ్రం చేశారు. సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, ఏఎ్‌సవో శ్రీనివాసులు,ఏపీవో మంజునాథ్, చంద్రశేఖర్‌రెడ్డి, రాంప్రసాద్, మురళీమోహన పాల్గొన్నారు.