ఎన్టీఆర్ కబడ్డీ టోర్నీ విజేత ‘పాల్తూరు’
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:51 PM
సంక్రాంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో చేపట్టిన నియోజకవర్గస్థాయి ఎన్టీఆర్ కబడ్డీ టోర్నమెంట్‌లో బుధవారం నిర్వహించిన ఫైనల్స్‌లో బొమ్మనహాళ్ జట్టుపై పాల్తూరు జట్లు విజయం సాధించింది
బొమ్మనహాళ్, జనవరి 14(ఆంధ్రజ్యోతి): సంక్రాంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో చేపట్టిన నియోజకవర్గస్థాయి ఎన్టీఆర్ కబడ్డీ టోర్నమెంట్‌లో బుధవారం నిర్వహించిన ఫైనల్స్‌లో బొమ్మనహాళ్ జట్టుపై పాల్తూరు జట్లు విజయం సాధించింది. విజేత జట్టుకు ఎమ్మెల్యే తనయుడు కాలవ భరత, జనసేన పార్టీ ఇనచార్జీ మంజునాథగౌడ, ఎస్‌ఐ నబీరసూల్ ట్రోఫీ అందజేశారు. విజేత పాల్తూరు జట్టుకురూ. 20,116, రన్నర్ అ్‌ప బొమ్మనహాళ్ జట్టుకు రూ. 10,116 అందజేశారు. టీడీపీ యూత పయ్యావుల అనిల్, పయ్యావుల శ్రీకాంత, నవీన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బలరాంరెడ్డి, నాయకులు ముల్లంగి నారాయణస్వామి, సత్యనారాయణ, మల్లన్న, తిప్పేస్వామి, రవిచంద్రసాగర్, లేపాక్షి, జనసేన నాయకులు శివరాజ్, మాజీ సర్పంచ బెళ్లి హనుమంతరెడ్డి పాల్గొన్నారు.