ఓహెచఆర్ పనుల నిలిపివేత
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:14 PM
స్థానిక జీబీసీ కార్యాలయం ఎదుట ఓహెచఆర్ ట్యాంక్ నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. ఈ పనులను మాజీ ఎంపీపీ రమణారెడ్డి గురువారం పరిశీలించారు.
విడపనకల్లు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): స్థానిక జీబీసీ కార్యాలయం ఎదుట ఓహెచఆర్ ట్యాంక్ నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. ఈ పనులను మాజీ ఎంపీపీ రమణారెడ్డి గురువారం పరిశీలించారు. రోడ్డు పక్కనే దాదాపుగా రూ. 10 కోట్లుకు పైగా విలువ చేసే జీబీసీ స్థలం ఈ ట్యాంక్‌ను ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశించారు. ఈ ట్యాంక్‌ను నిర్మిస్తే జీబీసీ కార్యాలయ గదుల్లోకి వెళ్లటానికీ వీలు లేకుండా పోతుందన్నారు. ఈ పనులను ఆపకపోతే సీఎం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీనిపై జీబీసీ డీఈ మంజునాధ, జీబీసీ జేఈ వాసుదేవ మాట్లాడుతూ.. ట్యాంక్ నిర్మాణానికి తాము ఎవ్వరికి అనుమతులు ఇవ్వలేదన్నారు. తమకు తెలియకుండా తమ కార్యాలయం ముందు పెద్ద గుంతను తవ్వారని, విషయం తెలిసిన వెంటనే ఆ పనులు చేయకుండా నిలిపివేయించామని తెలిపారు. జిల్లా అధికారుల నుంచి అనుమతులు వచ్చినా కార్యాలయం వెనుక వైపుగాని, కరకముక్కల దారి వైపుగాని ఓహెచఆర్‌ను నిర్మించేందుకు అనుమతులు ఇస్తామన్నారు.