గనిని సీజ్ చేసిన అధికారులు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:06 AM
మండలంలోని కొండుపల్లి గ్రామ సమీపంలో రమే్‌షబాబు మైన్స అండ్ మినరల్స్ గనిలో అక్రమంగా ఖనిజం తవ్వుతున్నట్లు భూగర్భ గనుల శాఖ అధికారి వరప్రసాద్‌రెడ్డి గురువారం గుర్తించారు
పెద్దవడుగూరు, జనవరి8(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండుపల్లి గ్రామ సమీపంలో రమే్‌షబాబు మైన్స అండ్ మినరల్స్ గనిలో అక్రమంగా ఖనిజం తవ్వుతున్నట్లు భూగర్భ గనుల శాఖ అధికారి వరప్రసాద్‌రెడ్డి గురువారం గుర్తించారు. సర్వేనెంబరు 319ఏ1, బీ1, 28 ఎకరాల్లో గాజుల రమణ నిబంధనలకు విరుద్ధంగా ముడిఖనిజాన్ని వెలికితీస్తూ అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడని, నోటీసులు జారీచేసినా పట్టించుకోలేదని, దీంతో సీజ్ చేశామని తెలిపారు. ఆయన వెంట వీఆర్వో సుదర్శనరెడ్డి, పోలీసులు ఉన్నారు.