Share News

అధికారుల తప్పు... వాహనం తుప్పు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:21 AM

ఈ వాహనాన్ని గతంలో అనేక మంది తహసీల్దార్లు వాడుకున్నారు. అయితే దాదాపు పదేళ్ల క్రితం చిన్నపాటి రిపేరీకి గురైంది

అధికారుల తప్పు... వాహనం తుప్పు
తుప్పుపట్టిన తహసీల్దార్‌ పాత వాహనం

ధర్మవరం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): ఈ వాహనాన్ని గతంలో అనేక మంది తహసీల్దార్లు వాడుకున్నారు. అయితే దాదాపు పదేళ్ల క్రితం చిన్నపాటి రిపేరీకి గురైంది. దానికి మరమ్మతులు చేయించకుండా.. అధికారులు కొత్త వాహనాన్ని తెప్పించుకున్నారు. అంతే.. ఇక నాటి నుంచి దాన్ని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణంలోని ఓ చెట్టు కింద ఇలా పడేవారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. తప్పు పట్టి శిథిలమైంది. కనీసం దాన్ని వేలం వేసి.. విక్రయించినా ప్రభుత్వానికి కొంతైనా ఆదాయం వచ్చేంది. అధికారులు ఆ విషయంలోనూ నేటికీ నిర్లక్ష్యం చూపుతూనే ఉన్నారు. ఈ తప్పుపట్టిన వాహనం... అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తహసీల్దార్‌ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చిన వారికి అధికారుల చిత్తశుద్ధిని వివరిస్తోంది.

Updated Date - Apr 18 , 2026 | 12:21 AM