బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:19 AM
స్థానిక కోటవీధిలో శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాలను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు.
కళ్యాణదుర్గం రూరల్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక కోటవీధిలో శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాలను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు గోపూజ నిర్వహించి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.