Share News

COLLECTOR: పోషకాహార లోపాన్ని నివారించాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:45 PM

పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేలా ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పని చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఐసీడీఎస్‌ పీడీ శశికళతో కలిసి జిల్లా మా తా, శిశు సంక్షేమ శాఖపై సమీక్షించారు.

COLLECTOR: పోషకాహార లోపాన్ని నివారించాలి
Collector Anand who is speaking

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేలా ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పని చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన ఐసీడీఎస్‌ పీడీ శశికళతో కలిసి జిల్లా మా తా, శిశు సంక్షేమ శాఖపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బి య్యం, రాగిపిండి, బ్యాళ్లు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, చిక్కీ లు, అటుకులు, ఖర్జూరం వంటి పోషకాహారాన్ని గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు వారి ఇంటివద్దకే పంపిణీ చేసేలా టేక్‌హోమ్‌ రేషన(టీహెచఆర్‌) విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ అం శంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. టీనేజ్‌ ప్రె గ్నెన్సీ, బాల్యవివాహాలతో కలిగే నష్టాలపై ప్రజలకు ఎలా అవగాహన అంశంపై కర్నూలులో సీడీపీవోలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చే శారన్నారు. అక్కడ నేర్చుకున్న అంశాలను జిల్లాలో అమలు చేయాలన్నారు. పోషన ట్రాకర్‌, గ్రోత మానిటరింగ్‌ వంటి ఆనలైన అం శాల్లో వందశాతం డేటాను నమోదు చేయాలన్నారు. అజాగ్రత్తగా పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కార్యక్రమం లో ఇనచార్జ్‌ డీఎంహెచవో డాక్టర్‌ శ్రీనివాసులు రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం రమే్‌షరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:45 PM