ఎన్టీఆర్ కబడ్డీ టోర్నీ ప్రారంభం
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:06 AM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత హైస్కూల్ మైదానంలో నియోజకవర్గస్థాయి ఎనటీఆర్ కబడ్డీ టోర్నమెంట్‌ను టీడీపీ నాయకులు సోమవారం ప్రారంభించారు.
బొమ్మనహాళ్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత హైస్కూల్ మైదానంలో నియోజకవర్గస్థాయి ఎనటీఆర్ కబడ్డీ టోర్నమెంట్‌ను టీడీపీ నాయకులు సోమవారం ప్రారంభించారు. దీన్ని ప్రారంభించిన టీడీపీ నాయకుడు ముల్లంగి నారాయణస్వామి మాట్లాడుతూ.. టీడీపీ యూత నాయకులు పయ్యావుల అనిల్, పయ్యావుల శ్రీకాంత, నవీన ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఫైనల్ మ్యాచ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఇందులో టీడీపీ నాయకులు డీలర్ పయ్యావుల రమేష్, వన్నూరుస్వామి, అశోక్ పాల్గొన్నారు.