చెత్త సేకరణపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:13 AM
స్థానిక ప్రశాంతి గ్రామ్ జానకిరాం కాలనీలో వారం రోజులగా చెత్తసేకరణకు పారిశుధ్య కార్మికులు రావడం లేదు.
పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రశాంతి గ్రామ్ జానకిరాం కాలనీలో వారం రోజులగా చెత్తసేకరణకు పారిశుధ్య కార్మికులు రావడం లేదు. దీంతో ఇంతకాలం నిల్వ ఉన్న తడిచెత్త, పొడిచెత్తను చెత్త కుండీల్లో వేస్తున్నారు. దీంతో అవి నిండి.. తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సక్రమంగా చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.