జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:45 PM
గుత్తి మార్కెట్ యార్డులో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పామిడి, గుత్తి మండలాల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు
పామిడి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): గుత్తి మార్కెట్ యార్డులో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పామిడి, గుత్తి మండలాల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌ఓ మలోలాకు వినతి పత్రం అందజేశారు. జొన్న క్వింటా రూ.3699, మొక్క జొన్న క్వింటా రూ. 2400కు కొనుగోలు చేయాలన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తామని డీఆర్‌ఓ వారికి హామీ ఇచ్చారు.