Share News

14న జాతీయ లోక్‌ అదాలత

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:08 AM

కేసుల సత్వర పరిష్కార మార్గమే లక్ష్యంగా మార్చి 14న జాతీయ లోక్‌ అదాలతను నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని న్యాయాధికారులు జయలక్ష్మి, లోకనాథం సూచించారు.

14న జాతీయ లోక్‌ అదాలత
కదిరిలో మాట్లాడుతున్న న్యాయాధికారులు

కదిరి లీగల్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కేసుల సత్వర పరిష్కార మార్గమే లక్ష్యంగా మార్చి 14న జాతీయ లోక్‌ అదాలతను నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని న్యాయాధికారులు జయలక్ష్మి, లోకనాథం సూచించారు. స్థానిక కోర్టులో న్యాయవాదులు, బ్యాంక్‌ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నగదు వ్యవహారాలు, భార్యభర్తలు, రెవెన్యూ సమస్యలు, కార్మిక, చెక్‌బౌన్స, విద్యుత, నీటి బిల్లులు తదితర సమస్యలను ఈ లోకదాలత ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:08 AM