MILK BANK: మా బిడ్డకు అమృతమిచ్చిన మదర్ మిల్క్‌బ్యాంక్
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:44 PM
నెలలనిండకుండానే పుట్టిన తమబిడ్డను 900గ్రామల నుంచి 1620 గ్రాములు బరువుపెరిగేలా ఆరోగ్యవంతమైన పాలను దానం చేసిన మదర్ మిల్క్‌బ్యాంక్ అమృతంలాంటిదని నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు రాజేశ్వరి, కృష్ణమూర్తి ఆనందాన్ని వ్యక్తంచేశారు.
అనంతపురం వైద్యం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): నెలలనిండకుండానే పుట్టిన తమబిడ్డను 900గ్రామల నుంచి 1620 గ్రాములు బరువుపెరిగేలా ఆరోగ్యవంతమైన పాలను దానం చేసిన మదర్ మిల్క్‌బ్యాంక్ అమృతంలాంటిదని నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు రాజేశ్వరి, కృష్ణమూర్తి ఆనందాన్ని వ్యక్తంచేశారు. వారు మాట్లాడుతూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. నెలలు నిండకుండా గతంలో రెండుసార్లు గర్భస్రావమైందన్నారు. మూడోసారి కూడా అలాగే జరుగుతుందని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ఆరోగ్యపరీక్షలు చేయించుకున్నామన్నారు. 7వనెలలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆర్డీటీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యామన్నారు. పరిస్థితి విషమించకుండానే మెరుగైన ఆస్పత్రికి వెళ్లాలని కిమ్స్ సవేరా ఆస్పత్రికి పంపారన్నారు. అక్కడ అడ్మిట్ చేసుకుని 4న సిజేరియన చేశారన్నారు. అయితే తమబిడ్డకు తల్లిపాలు లేవని పెద్దాస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ హేమలతను సంప్రదించడంతో సహాయం చేశారని హర్షాన్ని వ్యక్తంచేశారు. సవేరా డాక్టర్లు మౌనికరెడ్డి, గీత, సురేఖ, సౌమ్య, మహేష్, మనోహర్, నర్సులు, సిబ్బంది తల్లీబిడ్డను బాగా చూసుకున్నారన్నారు. మదర్ మిల్క్‌బ్యాంక్ కౌన్సెలర్లు రాధ, పల్లవి, నర్సులు సునీత, మానస, సుకన్య, హైమాతి, రమాదేవి, ఎంఎనవోలు వెంకటసాయి, వెంకటనారాయణ పాల్గొన్నారు.