Share News

అంధకారంలో పలు ప్రాంతాలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:48 PM

స్థానిక మెయిన రోడ్డు, ఆస్పత్రి రోడ్డు ప్రాంతాలకు విద్యుత సరఫరా చేసే ట్రాన్సఫార్మర్‌ చెడిపోవడంతో మంగళవారం రాత్రంతా ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అంధకారంలో పలు ప్రాంతాలు
అంధకారంలో ఉన్న తాడిమర్రి మెయిన రోడ్డు

తాడిమర్రి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): స్థానిక మెయిన రోడ్డు, ఆస్పత్రి రోడ్డు ప్రాంతాలకు విద్యుత సరఫరా చేసే ట్రాన్సఫార్మర్‌ చెడిపోవడంతో మంగళవారం రాత్రంతా ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొదట మధ్యాహ్నం నుంచి విద్యుత సరఫరా ఆగిపోవడంతో.. సరిచేసి సాయంత్రం 4 గంటలకు విద్యుత సరఫరా చేశారు. అయితే సబ్‌స్టేషనలో లైన మరమ్మతుల పేరుతో మళ్లీ సరఫరా ఆపేశారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి సరఫరా చేసిన వెంటనే ట్రాన్సఫార్మర్‌ కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి. అంతేకాకుండా విద్యుత సరఫరా ఆగిపోవడంతో బీఎ్‌సఎనఎల్‌, వివిధ నెట్‌వర్క్‌ల సేవలూ ఆగిపోయాయి. దీంతో రాత్రి ఆ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సిబ్బందికి గాయాలు..: మండలంలోని 33 కేవీ విద్యుత సబ్‌స్టేషనలో మంగళవారం సాయంత్రం మరమ్మతులు నిర్వహిస్తుండగా.. అర్త్‌ వైర్‌కు విద్యుత సరఫరా కావడంతో సబ్‌ ఇంజనీర్‌ భరత, హెల్పర్‌ లోకే్‌షరెడ్డి, వాచమన సుభాన తీవ్రంగా గాయపడ్డారు. మరమ్మతుల కోసం విద్యుత సరఫరాను అనుమతిలో నిలిపివేసి.. అర్త్‌ వైర్‌కు కేబుల్‌ వేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

Updated Date - Apr 14 , 2026 | 11:48 PM