Share News

నిబంధనలతో ఆటోలా..!

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:20 AM

పట్టణంలో కొందరు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. ప్రధాన రహదారుల గుండా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నారు.

నిబంధనలతో ఆటోలా..!
ప్లాస్టిక్‌ బిందెలు, క్యాన్ల లోడ్‌తో వెళ్తున్న ఆటో

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో కొందరు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. ప్రధాన రహదారుల గుండా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నారు. తోటి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఏ మాత్రం అటో.. ఇటో.. అయినా.. ఘోర ప్రమాదం తప్పదు. అయినా ట్రాఫిక్‌ అధికారులు ఇలాంటి ఆటో డ్రైవర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. శుక్రవారం ప్లాస్టిక్‌ బిందెలు, వాటర్‌క్యాన్లు, నూనె క్యాన్లుతో ఓ ఆటో ఇలా పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి, కళాజ్యోతి, కాలేజ్‌సర్కిల్‌, బస్టాండ్‌ ద్వారా పుట్టపర్తి వైపు వెళ్లింది. ఈ ఆటో నుంచి ఏ బిందెగాని.. క్యాన గాని ఊడి రోడ్డుపై పడితే.. వెనుక వచ్చే వాహనం అదుపు తప్పి.. ప్రమాదం జరిగే అవకాశముంది. అంతేకాకుండా ఆ ఆటో వెనుక వచ్చే వాహనదారులకు ముందువచ్చే వాహనాలు కానరాక ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Apr 18 , 2026 | 12:20 AM