ఘనంగా చౌడేశ్వరికి జ్యోతులు
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:15 AM
పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయ 35వ వార్షికోత్సవం సందర్భంగా నవజ్యోతుల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
రాయదుర్గం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయ 35వ వార్షికోత్సవం సందర్భంగా నవజ్యోతుల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరిదేవి ప్రాథమిక పాఠశాల వద్ద నుంచి తెల్లవారుజామున ప్రారంభమైన జ్యోతుల శోభాయాత్ర మధ్యాహ్ననికి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. విప్ కాలవ శ్రీనివాసులు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.