Share News

COLLECTOR: ఫూలే అడుగుజాడల్లో పయనిద్దాం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:51 PM

మహాత్మా జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో పయనిద్దామని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శనివారం పూలే 200వ జయంతిని పురష్కరించుకొని జిల్లా పరిషత ఆవరణలోని డీపీఆర్‌సీ సమావేశ భవనంలో బీసీ వెల్‌ఫేర్‌ డీడీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.

COLLECTOR: ఫూలే అడుగుజాడల్లో పయనిద్దాం
The collector and leaders paying tribute at the Phule statue

అనంతపురం న్యూటౌన, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి) మహాత్మా జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో పయనిద్దామని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శనివారం పూలే 200వ జయంతిని పురష్కరించుకొని జిల్లా పరిషత ఆవరణలోని డీపీఆర్‌సీ సమావేశ భవనంలో బీసీ వెల్‌ఫేర్‌ డీడీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జడ్పీ చైర్‌పర్షన గిరిజమ్మ, ఆర్టీసీ జోనల్‌ చైర్మన పూల నాగరాజుతో పాటు కార్పొరేషన్ల డైరెక్టర్లు హాజరయ్యారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫూలే చేసిన సేవలను కోనియాడారు. ఎస్సీ కార్పొరేషన డైరెక్టర్‌ కమలమ్మ, డైరెక్టర్లు పరమేశ్వర్‌, లక్ష్మీనరసింహులు, ఆదిరానాయణ, ఈశ్వర్యయ్య, మూర్తి, పవనకుమార్‌, రంగాచారి, బొమ్మినేని శివ, కొండన్న, ఇమామ్‌, లక్ష్మీప్రసాద్‌, కమ్మన్న, బీసీ వెల్ఫేర్‌ ఇనచార్జి డీడీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

టీడీపీ నాయకుల నివాళి

అనంతపురం క్రైం : మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు నివాళి అర్పించారు. ఆయన సేవలు స్మరించుకున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, శ్రీధర్‌ చౌదరి పూల మాలలు వేసి నివాళులర్పించారు. గడ్డం సుబ్రమణ్యం, వడ్డే వెంకట్‌, చల్లా లక్ష్మీప్రసాద్‌బాబు, రాయల్‌ మురళి, అర్హదుల్లా, గౌస్‌మొద్దీన, తాజుద్దీన, కృష్ణకుమార్‌, కుమారస్వామి నాయుడు, లింగారెడ్డి, కూచి హరి, మణికంఠబాబు, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆవుల కృష్ణయ్య, మున్వర్‌ పాల్గొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

టీడీపీ అర్బన కార్యాలయంలో నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుధాకర్‌ యాదవ్‌, ఫిరోజ్‌ అహ్మద్‌, ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, కొండవీటి భావన, కొండవీటి సుధాకర్‌ నాయుడు, పీఎల్‌ఎన మూర్తి, రంగాచారి, బొమ్మినేని శివ, బెస్త పవనకుమార్‌, సాకే లక్ష్మీనరసింహ, సంగా తేజశ్విని, సుంకన్న, రాజారావు, నెట్టెం బాలకృష్ణ, కాయగూరల శ్రీధర్‌, బాలాంజనేయులు, కేశవనాయుడు, వడ్డే వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఫూలే ఆశయాలు కొనసాగిద్దాం: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

శింగనమల: మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు కొనసాగిద్దామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శనివారం అనంతపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫూలే చిత్రపటాన్ని ఉంచి పూలమాల వేసి నివాలి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫూలే సమ సమాజ స్థాపనకై అహర్నిశలు కృషిచేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి అని కొనియాడారు. టీడీపీ కన్వీనర్‌ గోరంట్ల మారుతినాయుడు, కాయల అనిల్‌కూమార్‌, మాసూల చంద్రమోహన, రామునాయుడు, రమణయ్య, నరసింహులు, ఆదినారాయణ, తిప్పన్న, మునేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:51 PM