Share News

దిష్టిబొమ్మల్లా కియోస్క్‌లు

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:40 AM

గత వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రూ. కోట్ల ప్రజాధనం వృథా అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు పురుగుల మందులు, ఎరువుల బుక్‌ చేసుకునేందుకు రైతు సేవ కేంద్రాల్లో కియాస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేసింది.

దిష్టిబొమ్మల్లా కియోస్క్‌లు
ఉడేగోళంలో నిరుపయోగంగా ఉన్న కియోస్క్‌ యంత్రం

రాయదుర్గంరూరల్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): గత వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రూ. కోట్ల ప్రజాధనం వృథా అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు పురుగుల మందులు, ఎరువుల బుక్‌ చేసుకునేందుకు రైతు సేవ కేంద్రాల్లో కియాస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కొ యంత్రం ధర రూ. 72 వేలు. ఇలా కేవలం మండలంలోని ఆర్‌ఎ్‌సకేల్లోనే 14 కియో్‌స్కలను ఏర్పాటు చేసింది. ఈ యంత్రాల ద్వారా అధికారులు పురుగుల మందులు, ఎరువుల బుక్‌ చేయడంతో పాటు పలు వివరాలను నమోదు చేసేవారు. కాని ప్రభుత్వం ఆ యంత్రాల నిర్వహణను గాలికి వదిలేసింది. రైతు సేవ కేంద్రాల్లో సరిగా నెట్‌, విద్యుత సౌకర్యాలు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పురుగుల మందులు, ఎరువుల వివరాలను ఈ కియాస్క్‌ యంత్రాల ద్వారా కాకుండా అధికారులు వారివారి సెల్‌ ఫోన్ల ద్వారానే నమోదు చేస్తున్నారు. దీంతో రూ. కోట్లు ఖర్చు చేసి కొన్న ఈ యత్రాలు ప్రస్తుతం రైతు సేవ కేంద్రాల్లో దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి.

Updated Date - Jan 26 , 2026 | 12:40 AM