Share News

కసాపురం ఆలయం కిటకిట

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:37 AM

కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా భక్తులతో గురువారం కిటకిటలాడింది.

 కసాపురం ఆలయం కిటకిట
ఆలయం వద్ద భక్తుల సందడి

గుంతకల్లు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా భక్తులతో గురువారం కిటకిటలాడింది. దేవస్థానంలో పండితులు నిత్యహోమాన్ని నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం పక్కన హోమగుండాన్ని ఏర్పాటుచేయగా, అర్చకులు శాసో్త్రక్తంగా ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

స్వామి వారికి పట్టువస్రాలు : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్‌ గురువారం ఉదయం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజలు చేశారు. కుటుంబ సమేతంగా కసాపురానికి వచ్చిన మంత్రిని ఆలయ ఈఓ రాఘవరాజు, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి, ఆయన సతీమణి స్వామివారికి పట్టు వసా్త్రలు, పుష్ప మాలలు, పండ్లను సమర్పించారు. మంత్రి వెంట ఆయన సతీమణి హేమలత, కుమారులు విక్రమ సింహ, విజయ సింహ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు రమాదేవి, డీఎస్పీ శ్రీనివాసులు, శ్రీ కోదండరామస్వామి దేవస్థాన ఈఓ మల్లికార్జున, టీడీపీ నాయకులు ప్రతాప్‌ నాయుడు, రామన్న చౌదరి, పత్తి హిమబిందు, రాయంపల్లి నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:37 AM