Share News

విద్యతోనే అభివృద్ధి

ABN , Publish Date - May 24 , 2026 | 12:17 AM

సామాజిక, ఆర్థిక అభివృద్ధి విద్యతోనే సాధ్యమని ప్రభుత్వవిప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాల్మీకిభవనలో వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కులప్ప ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను శనివారం ప్రదానం చేశారు.

విద్యతోనే అభివృద్ధి
ప్రశంసాపత్రాలు అందజేస్తున్న కాలవ శ్రీనివాసులు తదితరులు

ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు

ప్రతిభా విద్యార్థులకు పురస్కారాల ప్రదానం

అనంతపురం విద్య, మే 23(ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక అభివృద్ధి విద్యతోనే సాధ్యమని ప్రభుత్వవిప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాల్మీకిభవనలో వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కులప్ప ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను శనివారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలవ శ్రీనివాసులు హాజరై విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాపరంగా ఎదిగినపుడే వాల్మీకి సామాజికవర్గం అభివృద్ధిలో పోటీపడుతుందన్నారు. వాల్మీకి కులస్థులు బాగా చదువుకుని ఉన్నతస్థితికి చేరాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ విద్యారంగాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతిఏటా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, పోలీస్‌ అధికారి మహేష్‌, గుమ్మనూరు నారాయణస్వామి, పామిడి వీరా, కుంటిమద్ది రంగయ్య, తలారి ఆదినారాయణ, వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కులప్ప, ప్రధాన కార్యదర్శి చైతన్యకుమార్‌, పవనకుమార్‌, డాక్టర్‌ నివేదిత, సాకే నరే్‌షతోపాటు పెద్దఎత్తున వాల్మీకులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 12:17 AM