Share News

అప్పుడే.. తాగునీటి కష్టాలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:11 AM

వేసవి రాకనే తాము తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని కొటంవారిపల్లి, పోరెడ్డివారిపల్లి గ్రామస్థులు వాపోతున్నారు

అప్పుడే.. తాగునీటి కష్టాలు
పొలం నుంచి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్థులు

నంబులపూలకుంట, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): వేసవి రాకనే తాము తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని కొటంవారిపల్లి, పోరెడ్డివారిపల్లి గ్రామస్థులు వాపోతున్నారు. కొటంవారిపల్లి గ్రామంలో రెండు బోర్లు వేసినా.. నీరుపడలేదని ఆ గ్రామస్థులు తెలిపారు. దీంతో తాము తాగునీటిని పొలాలకు వెళ్లి.. తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. పశువుల దాహార్థి తీర్చడానికి నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. పోరెడ్డివారిపల్లిలో మూడు రోజుల క్రితం మోటారు చెడిపోయిందని, దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు ఆ గ్రామస్థులు వాపోతున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించేలా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:11 AM