ఫీజు బకాయిల విడుదలపై హర్షం
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:05 AM
గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రూ.2,986 కోట్లను విడుదల చేయడంపై టీడీపీ ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతంకాటమయ్య, నియోజకవర్గ క్లస్టర్ ఇనచార్జ్ చింతలపల్లి మహేశచౌదరి హర్షం వ్యక్తం చేశారు
ధర్మవరం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రూ.2,986 కోట్లను విడుదల చేయడంపై టీడీపీ ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతంకాటమయ్య, నియోజకవర్గ క్లస్టర్ ఇనచార్జ్ చింతలపల్లి మహేశచౌదరి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఫీజు బకాయి విడుదల పోస్టర్‌ను టీడీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించిన వారు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా చేసిందని, నారా లోకేశ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేసి.. ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని 64 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు మై టీడీపీ యాప్‌ను డౌనలోడ్ చేసుకోవాలని, వారి పనితీరు ఆధారంగా నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని అన్నారు. ఇందులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశేసుధాకర్, ఏపీ నూర్‌బాషా సంఘం రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ రాళ్లపల్లి షరీప్, నాయకులు పణికుమార్, సంధారాఘవ, నాగూర్‌హుప్సేన, చింతపులుసు పెద్దన్న, చట్టా లక్ష్మీనారాయణ, మేకలరామాంజి, జింకాపురుషోత్తం పాల్గొన్నారు.