Share News

COLLECTOR: జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:06 AM

వర్కింగ్‌ జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడితో ఉంటారని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనిన, జర్నలిస్ట్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టర్‌ కాన్ఫరెన్స హాల్‌లో వర్కింగ్‌ జర్నలిస్టులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

COLLECTOR: జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
Collector distributing spectacles

అనంతపురం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): వర్కింగ్‌ జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడితో ఉంటారని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనిన, జర్నలిస్ట్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టర్‌ కాన్ఫరెన్స హాల్‌లో వర్కింగ్‌ జర్నలిస్టులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. మచ్చా రామలింగారెడ్డి, మీనాక్షమ్మ ఫౌండేషన చైర్మన రవికాంత రమణ, డాక్టర్‌ మదనమోహనరెడ్డి, సమాచార శాఖ ఏడీ బాలకొండయ్య పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి రవికుమార్‌, కాలవ రమణ కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తరఫున కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు ఎప్పుడూ జిల్లా యంత్రాంగం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుందని, జర్నలిస్టులు జిల్లా అభివృద్ధిలో భాగస్వామలు కావాలని కోరారు.

Updated Date - Apr 18 , 2026 | 12:06 AM