Share News

BJP : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే జనతా వారధి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:43 PM

ప్రజాసమస్యలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా జనతా వారధి ప్రారంభించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ అన్నారు.

BJP : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే జనతా వారధి
Rajesh is listening to problems in Janata Vardhi

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా జనతా వారధి ప్రారంభించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ అన్నారు. శుక్రవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన సమస్యలతో కూడిన వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే మెజార్టీ సమస్యలను ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఒత్తిడి చేస్తున్నామన్నారు. జనతా వారధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనతావారధి జిల్లా కో-కన్వీనర్‌ ఎల్‌. నాగేంద్రకుమార్‌, కార్యదర్శి గణేష్‌, సోషల్‌ మీడియా ఇనచార్జి దినేష్‌, తిరుమల కొండా, ఆనంద్‌, ఓబులేసు, శ్రీనివా్‌సబాబు, రవి, మాగిశెట్టి చంద్ర పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:43 PM