Share News

శిలాశాసనం గుర్తింపు

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:28 AM

మండలంలోని దంపేట్ల గ్రామ సమీపం శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వామి దేవాలయంలో క్రీ.శ. 1225 నాటి శిలా శాసనాన్ని ఉపాధ్యాయుడు గోపి ఆదివారం గుర్తించారు

శిలాశాసనం గుర్తింపు
శిలాశాసనం వద్ద ఉపాధ్యాయుడు గోపి

బత్తలపల్లి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని దంపేట్ల గ్రామ సమీపం శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వామి దేవాలయంలో క్రీ.శ. 1225 నాటి శిలా శాసనాన్ని ఉపాధ్యాయుడు గోపి ఆదివారం గుర్తించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ అప్పట్లో చిత్రవతి నది ఒడ్డు న .. ఈ ప్రాంతంలో మధురాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శ్రీలక్ష్మిచెన్నకేశవస్వామి దేవాలయాన్ని యాదవ రాజులు నిర్మించారు. అలయ సేవకులకు నాటి దేవగిరి యాదవ రాజు కొంత భూమిని దానంగా ఇచ్చారు. 1225 సంవత్సరం మాఘమాసం జనవరి 21 మంగళవారం రోజున వారికి భూమిని దానం ఇచ్చినట్లు ఈ శిలా శాసనంలో రాజు రాయించారు. భారత పురావస్తుశాఖ సహకారంతో గత సంవత్సరం అక్టోబరులో ధర్మవరం మండలం కునుతూరులో ప్రాచీన చంద్రమౌళేశ్వరస్వామి దేవాలయంలో ఇదే రాజు వేయించిన శాసనాన్ని కూడా నేను గుర్తించాను.’ అని తెలిపారు.

Updated Date - Mar 16 , 2026 | 12:28 AM