Share News

పొడి విత్తనాల సాగుతో ఆదాయం

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:10 AM

వర్షాకాలం ముందు పొడి విత్తనాల సాగు (పీఎండీఎస్‌) వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి, అధిక దిగబడితో ఆదాయం పొందవచ్చని నేచురల్‌ ఫార్మింగ్‌ అసోషియేట్‌ (ఎనఎ్‌ఫఏ) దామోదర్‌ రెడ్డి పేర్కొన్నారు.

పొడి విత్తనాల సాగుతో ఆదాయం
రాచువారిపల్లి తండాలో అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

కదిరి అర్బన, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ముందు పొడి విత్తనాల సాగు (పీఎండీఎస్‌) వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి, అధిక దిగబడితో ఆదాయం పొందవచ్చని నేచురల్‌ ఫార్మింగ్‌ అసోషియేట్‌ (ఎనఎ్‌ఫఏ) దామోదర్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కదిరి బ్రాహ్మనపల్లి, మల్లయ్యగారి పల్లి, రాచువారిపల్లి తండాలలో పీఎండీఎ్‌సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎండీఎస్‌ పద్ధతిలో ఆరు రకాల ప్రధాన పంటలు, 20 రకాల జీవ వైవిధ్య పంటల విత్తనాలను జీవామృతంతో శుద్ధిచేయడాన్ని ప్రదర్శించారు. ఈ విధానం వల్ల వేసవిలో భూమి వేడి తాపాన్ని తట్టుకొని ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు అందుతాయన్నారు. నేల గుల్ల బారి నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఏకకాలంలో బహుళ పంటలు వేయడం వలన అదనపు ఆదాయం వస్తుందన్నారు. మట్టిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యం పెరిగి ప్రధాన పంటలకు రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో డీటీఎస్‌ సంతో్‌షరెడ్డి, యూనిట్‌ ఇనచార్జ్‌ భాస్కర్‌ నాయుడు పాల్గొన్నారు

Updated Date - Feb 21 , 2026 | 12:10 AM