Share News

టీడీపీ నాయకులపై అక్రమ కేసులు

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:05 AM

తమపై స్థానిక సీఐ శివరాముడు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. అక్రమంగా కేసులు బనాయిస్తున్నాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నాయకులపై అక్రమ కేసులు
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

ముదిగుబ్బ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తమపై స్థానిక సీఐ శివరాముడు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. అక్రమంగా కేసులు బనాయిస్తున్నాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన వద్ద ఆందోళన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలపై అనవసరంగా ఎఫ్‌ఆర్‌ఐలు నమోదు చేసి బైండోవర్‌ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సివిల్‌ వ్యవహారంలో సుధాకర్‌, విశ్వనాథ్‌పై విచారణ లేకుండానే కేసు నమోదు చేశారన్నారు. సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సమస్యను పరిష్కరిస్తామని ధర్మవరం డీఎస్పీ హేమంత కుమార్‌ ఫోన ద్వారా వారికి హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు శాంతించి.. ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చరణ్‌, మల్లెల నారాయణస్వామి, సుధాకర్‌, విశ్వనాఽథ్‌, నరసింహులు, రామాంజి, ఫిరోజ్‌, స్టూడియో అశోక్‌, అమర పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:05 AM