గడ్డి మందు విక్రయిస్తే లైసెన్స రద్దు చేస్తాం
ABN , Publish Date - May 24 , 2026 | 12:19 AM
పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు నివారణ మందును ఎవరైనా విక్రయిస్తే లైసెన్స రద్దు చేస్తామని ఇనచార్జి ఏడీఏ వెంకట్‌కుమార్ హెచ్చరించారు. వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు పురుగు మందుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
అనంతపురం అర్బన, మే 23(ఆంధ్రజ్యోతి): పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు నివారణ మందును ఎవరైనా విక్రయిస్తే లైసెన్స రద్దు చేస్తామని ఇనచార్జి ఏడీఏ వెంకట్‌కుమార్ హెచ్చరించారు. వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు పురుగు మందుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కలుపు నివారణ మందు అధిక విషపూరితమైన రసాయనమని, దీనికి విరుగుడు లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. తద్వారా ఈ మందును నిషేధించారన్నారు. ఈ విషయాన్ని డీలర్లతోపాటు రైతులు గమనించి సహకరించాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైన పారాక్వాట్ డైక్టోరైడ్ కలుపు మందును విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్స రద్దు చే స్తామని హెచ్చరించారు. నగరంలో 25 పురుగు మందుల దుకాణాలకు, రాప్తాడు 2, గార్లదిన్నె 14, ఆత్మకూరు 1 దుకాణాలకు నోటీసులు జారీ చేశామన్నారు.