ఈ నీరు తాగేదెలా..?
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:10 AM
మండలంలోని గోవిందవాడ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం సమీపంలోని ఈ తాగునీటి కొళాయి చుట్టూ ఇలా అపరిశుభ్రత ఉంది.
బొమ్మనహాళ్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిందవాడ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం సమీపంలోని ఈ తాగునీటి కొళాయి చుట్టూ ఇలా అపరిశుభ్రత ఉంది. ఈ కొళాయి చుట్టూ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పశు వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. తప్పనిపరిస్థితుల్లో ఆలయానికి వచ్చే భక్తులు, గ్రామస్థులు ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే ఈ కొళాయి చుట్టూ శాశ్వత శుభ్రత చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.